డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య ఎఫెక్ట్‌తో ఆపదలో ఉన్న వారికి వెంటనే పోలీసుల సహయం అందించేందుకు కేంద్రం కొత్త యాప్‌ను ప్రవేశపెట్టనుంది. అత్యాధునిక సాంకేతిక సహయంతో 112అనే ఈ యాప్ ద్వారా మహిళలు, వృద్ధులు ఆపదలో ఉంటే వెంటనే పోలీసులకు, బంధువులకు, ఉన్నతాధికారులకు సమాచారం అందేలా ఈ యాప్‌ను రూపోందించారు.
112 అనే ఈ యాప్ ఇప్పటికే రూపోందిందని, ఇటీవలే రాష్ట్ర పోలీసులు కూడా ఈ యాప్‌లో భాగస్వాములు అయ్యేందుకు ఒప్పుకున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే… మన తల్లితండ్రులతో పాటు మన ఆపద సమయంలోని దగ్గర్లో ఉన్న పోలీసులకు, వాలంటీర్లతో పాటు… సంబంధిత ఉన్నతాధికారులకు కూడా ఒకేసారి సమాచారం అందుతుందని తెలిపారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.
ప్రియాంకరెడ్డి తల్లితండ్రులను పరామర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి… త్వరలో ఐపీసీ, సీఆర్‌పీసీ చట్టాలను మారుస్తున్నామని తెలిపారు. ఇలాంటి అత్యాచార ఘటనల్లో నిందితులకు వెంటనే శిక్షపడేలా చట్టాలు మారుస్తామన్నారు.
ఇక పోలీసులు మా పరిధి కాదు అని తప్పించుకోవడానికి లేదని… ఈ విషయంలో సహాయం చేయాల్సిందేనని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించిన విషయాన్ని గుర్తుచేశారు మంత్రి కిషన్‌రెడ్డి.