లాక్ డౌన్ ముగింపుకు కేవలం 7 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. కరోనా తీవ్రత దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా, మరికొన్ని ప్రాంతాల్లో తక్కువగా ఉంది.మరి ఈ పరిస్థితుల్లో ఎం చేయాలి? ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, నిన్నటి మంత్రి వర్గ సమావేశంలో మంత్రులకు కొన్ని సూచనలు చేసినట్టు సమాచారం. లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేస్తే పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారట.అందుకే దశల వారీ లాక్ డౌన్ ఎత్తివేత కు చర్యలు తీసుకోవాలని మంత్రులను ఆదేశించినట్టు తెలుస్తోంది.
దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను హాట్ స్పాట్ లుగా గుర్తించాలి.ఆ హాట్ స్పాట్ లేని ప్రాంతాలను నెమ్మదిగా తెరవడానికి ప్రయత్నం చేయాలని ఆదేశించినట్టు సమాచారం. తీవ్రత ఎక్కువగా ఉన్న హాట్ స్పాట్ ప్రాంతాల్లో లాక్ డౌన్ కొనసాగుతుంది. హాట్ స్పాట్ ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని యుద్ధప్రాతిపదికన తగ్గించే చర్యలు తీసుకోవాలని మోదీ మంత్రులను ఆదేశించారు.లాక్ డౌన్ ఒకేసారి ఎత్తేయడం సాధ్యం కాదని నిన్నటి మంత్రివర్గ సమావేశం నిర్ణయించినట్టు సమాచారం.కానీ , లాక్ డౌన్ ఎలా ఎత్తి వేయాలని కూడా ప్రధాని మంత్రులను అడిగినట్టు తెలుస్తోంది.జిల్లాల వారీగా లాక్ డౌన్ ఎత్తేస్తే ఎలా ఉంటుందని ప్రధాని, మంత్రులను అడిగినట్టు తెలుస్తోంది.
ప్రజల ప్రాణాలు కాపాడటం ఎంత ముఖ్యమో, దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించడం కూడా అంతే ముఖ్యం.దేశ ఆర్థిక వ్యవస్థపై COVID-19 యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలని ప్రధాని అన్నారు, మంత్రిత్వ శాఖలు వ్యాపార కొనసాగింపు ప్రణాళికను సిద్ధం చేయాలని అన్నారు.ప్రభుత్వం ఇందుకోసం ఎంతో కొంత ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది.
మొత్తానికి నిన్నటి మంత్రివర్గ సమావేశం తరువాత దేశం మొత్తం ఒకేసారి లాక్ డౌన్ ఎత్తే యడం అసాధ్యం.దశల వారీగా మాత్రమే లాక్ డౌన్ ఎత్తేసే అవకాశం ఉంది. ఈ రకంగా చూస్కుంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ స్పాట్ ప్రాంతాలు ఉన్నాయి. హైదరాబాద్,కరీంనగర్ , కర్నూల్..ఇలా మరికొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ కొనసాగే అవకాశం ఉండొచ్చు.