ఆగస్టు 15 దగ్గర పడుతుండడంతో కేంద్రం.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పలు సూచనలు చేసింది. ముఖ్యంగా ప్లాస్టిక్ తో తయారు చేసిన జాతీయ జెండాలను వాడకుండా చూడాలని కోరింది. పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్ వాడొద్దని ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపింది.
ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించినపుడు ప్లాస్టిక్ తో కాకుండా పేపర్, క్లాత్ తో తయారు చేసిన జెండాలను వాడాలని చెప్పింది కేంద్రం. జాతీయ జెండా ప్రజల నమ్మకాలకు, విశ్వాసాలకు ప్రతీకగా ఉండాలంటే తగిన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపింది. ప్రజలకు దీని గురించి తెలిసేలా మీడియాలో ప్రచారం చేయాలని సూచించింది కేంద్రం.