కరోనా కట్టడి కోసం ఏప్రిల్ 14వరకు కేంద్రం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. దీంతో దేశంలోని వ్యవస్థలన్ని స్తంభించాయి.పరిశ్రమలు క్లోస్ అయ్యాయి. కూలీలకు ఏపని లేకుండా పోయింది. దీంతో అప్పుడే అద్దె ఇళ్లలో ఉండే వారు ఈనెల ఇంటి కిరాయి ఎలా చెల్లించాలని ఆందోళన చెందుతున్నారు.
ఈక్రమంలో కేంద్ర హోంశాఖ వారికీ ఊరట కలిగించేలా స్పష్టమైన అదేశాలు జారీ చేసింది. అద్దె ఇళ్లలో నివాసముండే వారిని ఇంటి యజమానులు హౌస్ రెంట్ కోసం వేధించవద్దని తెలిపింది.ఎవరైనా కేంద్ర హోంశాఖ ఆదేశాలను బేఖాతరు చెస్తూ ఇంటి అద్దెకై వేధిస్తే చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామన్నారు.
అయితే కొంతమంది ఆయా పట్టణాల్లోని ఇంటి యజమానులు తమ ఉదార స్వభావాన్ని చాటుకుంటున్నారు. పరిస్థితులు సద్దుమణిగే వరకు ఇంటి రెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ చెప్తున్నారు.