ఆర్టీసీ సమ్మెపై కేంద్రం దృష్టిసారించింది. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు ఇబ్బందులు పడుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కేంద్రమంత్రి గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు బీజేపీ ఎంపీలు. వెంటనే జోక్యం చేసుకొని కార్మికులను కాపాడాలని కోరారు.
తనకు విషయం మొత్తం తెలుసని… త్వరలోనే మంత్రి పువ్వాడ అజయ్‌తో పాటు ఆర్టీసీ యాజమన్యాన్ని ఢిల్లీకి పిలిపించి మాట్లాడుతానని, కార్మికులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
కేంద్రానికి ఈ విషయంలో జోక్యం చేసుకునే అవకాశం ఉంది. అయితే… రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని బట్టి కేంద్రం రంగలోకి దిగుతుంది. ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిని పక్కనపెట్టాలని, కార్మికులు విధుల్లోకి వచ్చేందుకు ఒప్పుకున్నందున వెంటనే డ్యూటీలోకి తీసుకోవాలని కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అవసరమయితే సీఎం కేసీఆర్‌తో మాట్లాడుతానని… రాష్ట్ర రవాణా మంత్రితో పాటు ఇతర అధికారులను ఢిల్లీకి పిలిపిస్తానని హామీ ఇచ్చినట్లు కిషన్ రెడ్డి తెలిపారు.