మెక్కిన మొత్తం కక్కించే దిశగా కేంద్రం చర్యలు - Central Govt Serious On Megha Krishna Reddy Scams - Tolivelugu

మెక్కిన మొత్తం కక్కించే దిశగా కేంద్రం చర్యలు

కేంద్రం దూకుడు పెంచింది. మేఘా కృష్ణారెడ్డిపై ఇలాంటి దాడులు జరుగుతాయని సామాన్య ప్రజానీకం, మేధావి వర్గాలు అసలు ఊహించనే లేదు. ఒక్కసారి కేంద్రం జూలు విదిల్చింది. ఇంతకాలం తాను ఆడిందే ఆటగా పాటగా భావించిన కృష్ణారెడ్డి కేంద్రం చర్యలతో ఒక్కసారిగా షాక్ కి గురయినట్లు తెలుస్తుంది. 4 కంపెనీల కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి ఈ మధ్య కాలంలో ఒకరిపై ఐటి రైడ్ కి ఈడీ తనిఖీలకు ఇన్ని కంపెనీల బలగాలను ఉపయోగించలేదు.

కేంద్రం కృష్ణా రెడ్డి కి సంబంధించిన కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకొని ఆయనకు సంబంధించిన కొన్ని కీలక వ్యవహారాలకు అడ్డుకట్ట వేయాలని చేస్తుంది. తన డబ్బు పలుకుబడితో రెండు రాష్ట్రాలను శాసించే స్థాయికి ఎదిగిన అక్రమ శిఖరం కృష్ణారెడ్డి ఈ మధ్యే కేంద్రంలోని ఒక కీలక నేతను కూడా ఒక పని విషయంలో బెదిరించాడని, వెంటనే ఆ కీలక నేత కేంద్రంలోని నెంబర్ 2 పొజిషన్ దృష్టికి తీసుకెళ్లాడని దాని ఫలితమే ఈ రైడ్లు, తనిఖీలని విశ్వసనీయ సమాచారం.

Share on facebook
Share on twitter
Share on whatsapp