కొత్త ప్రైవసీ పాలసీతో వినియోగదారుల వ్యక్తిగత సమచారాన్ని ట్రేస్ చేయాలని భావిస్తున్న వాట్సాప్‌కు కేంద్రం షాకివ్వబోతోంది. వాట్సాప్‌కు ధీటుగా ప్రభుత్వమే ఓ దేశీయ యాప్‌ను ఆవిష్కరించబోతోంది. వాట్సాప్ నుంచి మరో ప్రత్యామ్నాయ యాప్ కోసం యూజర్లు ప్రయత్నం చేస్తున్న సమయంలో కేంద్రమే ఆ లోటును తీర్చాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు సందేశ్ పేరుతో ఓ యాప్‌ను రూపొందిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ యాప్‌ను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు.
ఇప్పటికే సందేశ్ యాప్‌ను ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అధికారులతో టెస్టింగ్ చేయించిందని.. ఐవోఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లపై ఉపయోగించేలా దీన్ని రూపొందిస్తున్నారని తెలుస్తోంది. వాట్సాప్‌లో లభించే అన్ని సదుపాయాలను ఇందులోనూ తీసుకొస్తున్నట్టుగా చెప్తున్నారు. కాగా ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వారి కోసం మాత్రమే దీన్ని తయారు చేస్తున్నారా లేక.. సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకొస్తారా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు.