అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధన సంస్థ హిండెన్ బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు అదానీ గ్రూప్ షేర్లను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ కారణంగా అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు అన్నీ ఢమాల్ అంటున్నాయి. ఈ గ్రూప్ లో పలు కంపెనీల షేర్లు పతనం కావడంతో ఇన్వెస్టర్లు లబోదిబోమంటున్నారు. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా రాజకీయ మలుపు తీసుకుంటోంది.
ఈ అంశంపై ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నాయి. తాజాగా అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
అదానీ గ్రూప్ స్టాకుల్లో ఎల్ఐసీ, ఎస్‌బీఐ సంస్థలు రూ. 77 వేల కోట్లు, రూ. 80 వేల కోట్లు ఎందుకు పెట్టాయి? ఎల్ఐసీ, ఎస్‌బీఐ సంస్థలను నెట్టిందెవరు? ఈ మొత్తం వ్యవహారంలో వారికి ఎవరు సహాయం చేశారు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ తీవ్రమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు.
There are serious questions that need to be answered by the NPA Govt on #HindenburgReport
Why do LIC & SBI have such large exposure ₹77,000 Cr & ₹80,000 Crore to Adani group stocks? Who pushed them to do so?
Who was aiding & abetting them in this entire episode?
— KTR (@KTRBRS) January 28, 2023
అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. అదానీ గ్రూప్ లో అవకతవకల వార్తలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై అంతర్జాతీయ నివేదికలపై ప్రతి భారతీయుడు సందేహాలకు కేంద్రం సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. సెబీతో పాటు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచించారు కవిత.