హైకోర్టు తీర్పుతో సోమేష్ అంశంలో కేంద్రం వెంటనే చర్యలు తీసుకుంది. గంటల వ్యవధిలోనే తెలంగాణ క్యాడర్ నుండి రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే రిలీవ్ అయ్యి.. 12వ తేదీలోపు ఏపీలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
అయితే.. సీఎం కేసీఆర్ తో సుదీర్ఘ చర్చలు జరిపిన సోమేష్.. ఏపీకి వెళ్లేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ లో ఆయన రిటైర్ కానున్నారు. ఈ కొద్ది సమయంలోనే మళ్లీ ఏపీకి ఏం వెళ్తామనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
తక్షణమే తెలంగాణ క్యాడర్ నుండి రిలీవ్ కావాలన్న కేంద్రం ఆదేశాల నేపథ్యంలో సోమేష్ వీఆర్ఎస్ తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. మొత్తానికి ఈ అంశం ఇంట్రస్టింగ్ గా సాగుతోంది.
సోమేష్ తెలంగాణలో కొనసాగింపును రద్దు చేస్తూ తీర్పునిచ్చింది హైకోర్టు. కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఉత్తర్వులను కొట్టివేస్తూ ఆయన్ను ఏపీ వెళ్లాలని ఆదేశించింది. సోమేష్ కుమార్ న్యాయవాది తీర్పు అమలును 3 వారాలు నిలిపివేయాలని కోరారు. కానీ, ఎలాంటి సమయం ఇవ్వలేదు హైకోర్టు. సోమేష్ తరపు న్యాయవాది అభ్యర్థనను తోసిపుచ్చింది.