దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ తొలి రోజు విజయవంతమైంది. కానీ మొదటి నుంచి అనుకుంటున్న లక్ష్యాన్ని మాత్రం ప్రభుత్వం చేరుకోలేకపోయింది. తొలి రోజు దేశవ్యాప్తంగా మొత్తం మూడు లక్షల మందికి టీకాలు వేయాలని కేంద్రంగా లక్ష్యంగా పెట్టుకుంది. కానీ చివరికి తొలిరోజున మొత్తం 1.91 లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్ వేసినట్టుగా కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
వ్యాక్సినేషన్ కోసం దేశవ్యాప్తంగా 3 వేలకు పైగా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఒక్కో సెంటర్‌లో వంద మందికి తక్కువ కాకుండా వ్యాక్సిన్లు వేయాలని సూచించింది. కానీ కోవిన్ యాప్‌లో ఇబ్బందులు, ఇతర సమస్యల కారణంగా నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. కేంద్ర ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం తెలంగాణలో 3,962, ఏపీ-19,025, బీహార్- 16,401, ఢిల్లీ- 3,403, గుజరాత్- 8,557, యూపీ- 15, 975 మందికి వ్యాక్సిన్లు వేశారు.