కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతోన్న నేపథ్యంలో దేశవ్యాప్త్యంగా 75 జిల్లాలో లాక్ డౌన్ విధిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్త్యంగా అత్యవసర సర్వీసులు మినహా అన్నింటిని రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు.దీంతో రాష్ట్రాల మధ్య వాహన రాకపోకలు నిలిచిపోనున్నాయని..అత్యవసర రవాణా సేవలు మాత్రమే కొనసాగుతాయని ఆయా రాష్ట్రాలకు కేంద్రం స్పష్టం చేసింది. ఇక, తాజాగా కరోనా నేపథ్యంలో ఈనెలఖరు వరకు రైల్వే సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది.
మనదేశంలో కరోనా లక్షణాలు ఆలస్యంగా కనిపిస్తున్నాయని .. కొంతమందికి వారం రోజుల తరువాత కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పారు. ఈమేరకు ఆయా రాష్ట్రాలను అలర్ట్ చేస్తూ దేశంలోని కరోనా ప్రభావం ఎక్కువగా రాష్ట్రాలను గుర్తించి 75 జిల్లాలో లాక్ డౌన్ ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ఈనేపథ్యంలోనే మార్చి 31 వరకురైల్వే సేవలను కుడా నిలిపివేస్తునట్లు పేర్కొంది .
తెలంగాణలో ఐదు జిల్లాలో లాక్ డౌన్ కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ,సంగారెడ్డి, భద్రాద్రి జిల్లాలో లాక్ డౌన్ ఉంటుందని ప్రకటించారు. కేంద్రం సూచన మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు జాగ్రత్తల దృష్ట్యా తెలంగాణలోని అన్ని జిల్లాలో లాక్ డౌన్ ఉంటుందని స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారందరికీ రేషన్ సరుకులతోపాటు 1500 రూపాయలు ఇస్తామని తెలిపారు. ఇక, ఏపీలో మూడు జిల్లాల్లో లాక్ డౌన్ ఉంటుందని చెప్పారు. విశాఖ, ప్రకాశం, కృష్ణాజిల్లాలో లాక్ డౌన్ విధిస్తున్నట్లు కేంద్రం ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.