కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ గణతంత్ర దినం రోజున ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించిన రైతులు.. ఢిల్లీలోని ఎర్రకోట పైకి ఎక్కి బీభత్సం సృష్టించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కోటపై జెండాలు పాతి హంగామా సృష్టించారు. ఈ క్రమంలో వారసత్వ సంపదకు అయిన ఎర్రకోటను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ సందర్శించారు.
రైతుల దాడిలో కోట కొంత ధ్వంసమైనట్టుగా గుర్తించారు. కోటపై భాగంలో జెండాలు పాతే ప్రయత్నంలో బురుజు ఎక్కిన రైతులు.. కొన్ని ఇటుకలను తొలగించారు. ఫలితంగా కొన్ని చోట్ల కోట గోడ కొంత ధ్వంసమైంది. కాగా సుమారు 400 ఏళ్ల క్రితం ఎర్రకోటను నిర్మించారు. మరోవైపు ట్రాక్టర్ ర్యాలీలో చెలరేగిన ఘర్షణల్లో.. దాదాపు 300 మంది పోలీసులు గాయపడ్డారు. ఓ రైతు మృతి చెందాడు.