కేంద్ర మంత్రులు వరుసగా కరోనా బారిపడుతున్నారు. తాజాగా మరో కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రెండోసారి పరీక్షల్లో నాకు కరోనా నిర్ధారణ అయింది. ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నారు. ఎయిమ్స్ వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరుతున్నాను. ఇటీవల నాతో సన్నిహితంగా ఉన్నవారు జాగ్రత్తంగా ఉండాలని కోరుతున్నాను అంటూ ఆయన ట్వీట్ చేశారు.
कोरोना के शुरूआती लक्षण आने पर मैंने टेस्ट करवाया व पहली जाँच नेगेटिव आने के बाद आज दूसरी जाँच पॉजिटिव आई है।
मेरी तबीयत ठीक है परन्तु चिकित्सकीय सलाह पर AIIMS में भर्ती हूँ। मेरा निवेदन है कि जो लोग गत कुछ दिनों में मेरे संपर्क में आयें हैं, कृपया अपने स्वास्थ्य का ध्यान रखे ।— Arjun Ram Meghwal (@arjunrammeghwal) August 8, 2020
అర్జున్ రామ్ మేఘవాల్‌తో కేంద్రంలో కరోనా సోకిన మంత్రుల సంఖ్య నాలుగుకు చేరింది. అంతకుముందు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయన జోద్‌పూర్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు.
ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కరోనాకు చికిత్స తీసుకుంటుండగా.. ఆయన తర్వాత మరో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌కు కూడా వైరస్ సోకింది.