కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆసక్తికర ట్వీట్ చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఇటీవల తనను పొగడటంపై తాజాగా స్పందించారు. కొద్ది రోజుల క్రితం ఓ కార్యక్రమంలో ఇద్దరు కలిసినప్పుడు.. కిరణ్ రిజిజును చూసి ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకున్నారేమో అని తాను అనుకున్నానని, కానీ ఆయన గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి అని తెలుసుకుని ఆశ్చర్యపోయాయని ఎన్వీ రమణ చెప్పారు. కిరణ్ రిజిజు డైనమిక్ పర్సన్ అని ప్రశంసించారు ఆయన. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై కిరణ్ రిజిజు ట్విట్టర్ వేదికగా స్పందించారు.
Hon'ble Chief Justice of India Mr. Justice N.V. Ramana is very much right. I studied in my village Govt Primary School & Govt Secondary School and my village got electricity when I passed my Class X. My village got road in 2006 through DoNER Ministry when I became Lok Sabha MP. https://t.co/B8JyTGdCvF pic.twitter.com/7vEkQGKhjZ
— Kiren Rijiju (@KirenRijiju) September 12, 2021
Advertisements
సీజేఐ ఎన్వీ రమణ చెప్పింది నిజమని, తాను గ్రామీ ప్రాంతం నుంచే వచ్చానని చెప్పుకొచ్చారు. తాను పదో తరగతి చదువుతున్నప్పుడు మొదటిసారి విద్యుత్‌ను సౌకర్యాన్ని అనుభవించినట్టు గుర్తు చేసుకున్నారు. తమ గ్రామానికి తాను ఎంపీ అయ్యాకే 2006లో రోడ్డు వేశారని చెప్పుకొచ్చారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.