తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ అబద్దాల కోరు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
రానున్న రోజుల్లో కేసీఆర్ నిజస్వరూపం బట్టబయలు కాబోతుందన్నారు. కేసీఆర్ మోసాలను, అబద్దాలను వినేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరన్నారు.
కేసీఆర్ దేశ నాయకుడంటూ డబ్బా కొట్టుకుంటున్నారని సెటైర్లు వేశారు. నాయకుడు కావాలంటే ప్రజల్లో ఆ భావన రావాలన్నారు. కావాలని సొంత డబ్బా కొట్టించుకుంటున్నారన్నారు.
బీఆర్ఎస్ పార్టీతో పాటు.. కేసీఆర్ సర్కార్ అబద్దాల మీదనే నడుస్తోందని దుయ్యబట్టారు. కేసీఆర్ అబద్దాలతో ప్రజలు విసిగిపోయారని వ్యాఖ్యానించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.