ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ పై బీజేపీ నేతలు విమర్శల దాడికి దిగారు. మహిళలపై జరుగుతున్న ఘోరాల విషయంలో భారత్ ను ఆఫ్ఘనిస్తాన్ తో పోల్చారాయన. చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని అన్నారు. ఇంత జరుగుతున్నా ఏం చేయని కేంద్రం.. ఆఫ్ఘాన్ లో మహిళల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ఈ కామెంట్సే బీజేపీ నేతల ఆగ్రహానికి కారణమైంది.
అసద్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి శోభా కరాంద్లజే స్పందించారు. ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన్ను ఆఫ్ఘనిస్తాన్ కు పంపితే బెటర్ అని ఎద్దేవా చేశారు. అక్కడకు వెళ్లాక ఆయన వాళ్ల సమాజానికి, మహిళలకు రక్షణ కల్పిస్తారని అన్నారు కేంద్రమంత్రి.
ఇటు అసదుద్దీన్ వ్యాఖ్యలపై ఇతర బీజేపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.