పాత వాహనాలతో కాలుష్యం, అలాగే ప్రమాదాలు పెరుగుతుండటంతో.. ఈ బడ్జెట్‌లో వాటి నివారణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నూతన విధానాన్ని ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కాలం చెల్లిన వాహనాలను స్క్రాప్‌గా మార్చాలని నిర్ణయించినట్టు తెలిపింది. ఇకపై వ్యక్తిగత వాహనాల జీవిత కాలం 20 ఏళ్లు, వాణిజ్య వాహనాల జీవితకాలం 15 ఏళ్లుగా మాత్రమే ఉండనుంది.న్యూ స్క్రాప్ పాలసీ ఆటోమొబైల్ రంగానికి శుభపరిణామంగా భావిస్తున్నారు. కొత్తగా వాహన ఉత్పత్తికి సానుకూల అంశమని అంచనా వేస్తున్నారు. పాత వాహనాలు నిరుపయోగంగా మారనుండడంతో కొత్త వాటికి డిమాండ్ పెరిగి.. ఫలితంగా ఆటోమొబైల్ రంగానికి బూస్ట్ దక్కనుంది. ప్రస్తుతం దేశంలో 30 నుంచి 40 ఏళ్ల పాత వాహనాలను కూడా వినియోగిస్తున్నారు. ఇకపై అవన్నీ స్క్రాప్‌గా మారబోతున్నాయి.