కొత్త ప్రాజెక్టులు కడుతున్నారంటూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. దీంతో అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసిన కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్… ఇరు రాష్ట్రాలు కొత్త ప్రాజెక్టుల డీపీఆర్ లు ఇవ్వాలని ఆదేశించారు. అక్టోబర్ 6న జరిగిన సమావేశంలో తీసుకున్న డీపీఆర్ సమర్పణ నిర్ణయాన్ని అమలు చేయాలని ఇరు రాష్ట్రాల సీఎంలకు తాజాగా లేఖ రాశారు.
కొత్త ప్రాజెక్టులకు అనుమతి తప్పనిసరని, కృష్ణా-గోదావరి నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల వివరాలను ఇవ్వాలని కేంద్రమంత్రి ఆదేశించారు. కృష్ణా, గోదావరి నదులపై ఏపీ సర్కార్ 19 అక్రమ ప్రాజెక్టులు కడుతున్నట్లు ఫిర్యాదు అందగా, తెలంగాణ 15 ప్రాజెక్టులు కడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ మొత్తం ప్రాజెక్టుల డీపీఆర్ లు వెంటనే సమర్పించాలని, అపెక్స్ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వరకు పనులు చేపట్టరాదని కేంద్రమంత్రి లేఖలో సూచించారు. అపెక్స్ కౌన్సిల్ ఈ డీపీఆర్ లు వీలైనంత త్వరగా పరిశీలించి, నిర్ణయం తీసుకుంటుందని… ఆలస్యం చేయదని తెలిపారు.
ప్రాజెక్టుల డీపీఆర్ లు ఇవ్వకుండా ఇన్నాళ్లుగా నెట్టుకొస్తున్న ఇరు రాష్ట్రాలు ఇప్పుడేం చేస్తాయో చూడాలి.