వ్యవసాయం సహా పలు శాఖల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోడెద్దుల్లాగా వెళ్తేనే… ప్రజల సంక్షేమ పథకాల బండి నడిచేది. ముఖ్యంగా రైతులకు ఎంతో సహాయంగా ఉంటూ… నీటి ఇబ్బందులున్న రైతులకు ఎంతో మేలు చేస్తున్న డ్రిప్ ఇరిగేషన్ కు కేంద్రం ప్రతి ఏటా నిధులు విడుదల చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్ ఇవ్వకపోవటంతో కేంద్రం ఇస్తున్న నిధులు కూడా వెనక్కి వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది.
కేంద్రం తన వాటాగా నిధులు ఇస్తే… రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలా డ్రిప్ ఇరిగేషన్ కు 2018-19లో కేంద్రం 122కోట్లు ఇచ్చింది. రాష్ట్రం తన వాటాగా 244కోట్లు ఇవ్వాల్సి ఉండగా రిలీజ్ చేయలేదు. ఈ మూడేళ్లలో కేంద్రం 841కోట్లు ఇస్తే 230కోట్లు మాత్రమే వాడుకోవటంతో మిగిలిన 611కోట్లు వెనక్కి వెళ్లిపోయాయి. ఎన్నిసార్లు ప్రతిపాదనలు పంపినా రాష్ట్ర సర్కార్ స్పందించలేదని తెలుస్తోంది.
90శాతం సబ్సిడీతో డ్రిప్ పైప్స్ సప్లై చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటుంది. దాంతో రైతులు పెద్ద ఎత్తున సబ్సిడీ డ్రిప్ కోసం అర్జీలు పెట్టుకుంటున్నా ఫలితం లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం వద్ద దాదాపు లక్షన్నరకుక పైగా అర్జీలు పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.