కేంద్రం తన అభివృద్ధి పనులతో ఢిల్లీ రూపురేఖలను మార్చేస్తోందని ప్రధాని మోడీ అన్నారు. దేశ రాజధానిని తమ పాలనలో మరింత ఆధునీకరిస్తున్నాయని ఆయన ఉద్ఘాటించారు. ప్రగతి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్ ప్రాజెక్ట్ ప్రధాన సొరంగం, ఇతర ఐదు సొరంగ మార్గాలను ఆయన ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ఢిల్లీ-ఎన్‌సీఆర్, ఢిల్లీ-మీరట్ హైవేలో మెట్రో ట్రాక్‌లను ఏర్పాటు, తూర్పు, పశ్చిమ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వేలతో సహా తమ పాలనలో చేపట్టిన అనేక అభివృద్ధి పనుల గురించి ఆయన ఈ సందర్బంగా ప్రస్తావించారు.
ఢిల్లీకి కేంద్ర ప్రభుత్వం నుంచి అందమైన మౌలిక సదుపాయాల బహుమతి లభించిందని ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం ప్రధాని మోడీ చెప్పారు. ఈ ప్రాజెక్టు వల్ల 55 లక్షల లీటర్ల ఇంధనం ఆదా అవుతుందన్నారు. దీంతో పాటు కాలుష్యాన్ని తగ్గించవచ్చని ఆయన పేర్కొన్నారు.
పట్టణీకరణకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజల జీవన సౌలభ్యాన్ని పెంచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని మోడీ వివరించారు. ప్రజల కోసం 100 కోట్ల పథకం ప్రకటిస్తే అంతా చర్చించుకుంటారని చెప్పారు. కానీ 200 కోట్లను ప్రభుత్వం ఆదా చేస్తే దానిపై ఎవరూ మాట్లాడరు.