వస్త్ర ఎగుమతులను పెంచేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పత్తి దిగుమతులపై అన్ని కస్టమ్స్ సుంకాలను కేంద్రం ఎత్తి వేసింది. ఈ పన్ను మినహాయింపు సెప్టెంబర్ 30 వరకు వర్తిస్తుందని తెలిపింది.
పత్తి దిగుమతులను వ్యవసాయ మౌలికసదుపాయాల అభివృద్ధి సెస్, కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయిస్తున్నట్టు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు ప్రకటనలో తెలిపింది.
ఈ ఆదేశాలు ఏప్రిల్ 14 నుంచి అమలులోకి వస్తాయని బోర్డు ప్రకటించింది. సెప్టెంబర్ 30 వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని బోర్డు వెల్లడించింది.
ఈ మినహాయింపు చేనేత పరిశ్రమకు, నూలు పరిశ్రమలకు, ఫాబ్రిక్ వస్త్రాల పరిశ్రమలకు లబ్ధి చేకూరుస్తుందని ప్రభుత్వం తెలిపింది. దీనితో పాటు వినియోగదారులకు ఉపశమనం కలుగుతుందని పేర్కొంది.
దీనిపై ఎఫ్‌ఐఈఓ ప్రెసిడెంట్ డాక్టర్ ఎ శక్తివేల్ మాట్లాడుతూ… నూలు, బట్టల ధరలను తగ్గించడం ద్వారా దుస్తులు, తయారీ రంగాల ఎగుమతులను ఇది గణనీయంగా పెంచుతుందన్నారు.