దేశంలో బలమైన ప్రతిపక్షం ఉండాలని తాను కోరుకుంటున్నట్టు ప్రధాని మోడీ తెలిపారు. యూపీలో పారౌంఖ్ లో జరిగిన ఓ కార్యక్రమానికి ప్రధాని మోడీ శుక్రవారం హాజరయ్యారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… దేశంలో నైపుణ్యాన్ని వారసత్వ రాజకీయాలు అణచివేస్తున్నాయని అన్నారు. దేశంలో వారసత్వ పార్టీలన్నీ తనకు వ్యతిరేకంగ ఏకమవుతున్నాయని చెప్పారు.
ఆ పార్టీ కుటిల రాజకీయ నీతిని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దేశంలో వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలన్నారు. అప్పుడే ఎక్కడో మారుమూల కుగ్రామంలో పుట్టిన వారు కూడా ప్రధాని, రాష్ట్రపతులు కాగలరని అన్నారు.
తనకు ఎవరితోనూ వ్యక్తిగత విభేదాలు, శత్రుత్వం లేదని వివరించారు. దేశంలో ఒక బలమైన ప్రతిపక్షం ఉండాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు చెప్పారు. పార్టీలు బంధుప్రీతిని వదిలి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.