దేశంలో ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీనిపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధానంగా ఐదు రాష్ట్రాల్లో కరోనా కేసులు అధికంగా నమోదవుతుండటంపై కేంద్రం కలవరపడుతోంది.
ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఐదు రాష్ట్రాలకు లేఖ రాశారు. తమిళనాడు, కేరళ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటకలో స్థానిక సంక్రమణ జరుగుతోందని విశ్వసిస్తున్నట్టు ఆయన తెలిపారు.
మహమ్మారిపై పోరాటంలో ఇప్పటివరకు సాధించిన విజయాలను కోల్పోకుండా ప్రజారోగ్య ప్రతిస్పందనలపై రిస్క్ అసెస్‌మెంట్ ఆధారిత విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని రాష్ట్రాలకు ఆయన సూచించారు.
రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులపై దృష్టి సారించాలని సూచనలు చేసింది. కరోనా వ్యాప్తి చెందుతున్నట్టు కనిపిస్తే సంక్రమణను నియంత్రించడానికి అవసరమైతే ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.