కమ్యునిస్టులు దేవుళ్లని నమ్ముతారని, దేవున్ని నమ్మడం అనేది మానవతా సిద్ధాంతమని వెల్లడించారు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట రెడ్డి. శనివారం ఆయన కుటుంబ సమేతంగా కొత్తకొండ వీరభద్ర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ ఈవో కిషన్ రావు, అభివృద్ధి కమిటీ చైర్మన్ మాడిశెట్టి కుమారస్వామి కండువాతో సన్మానించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం చాడ వెంకట రెడ్డి మాట్లాడుతూ.. కొత్తకొండ వీరభద్ర స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆలయ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానన్నారు.
కమ్యునిస్టులు దేవుడిని నమ్మరని కొంతమంది పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని.. ఇది సబబు కాదన్నారు. దేవుళ్లకు కమ్యునిస్టులు వ్యతిరేకం కాదన్నారు.
మతం పేరుతో, కులం పేరుతో ఆధిపత్యం చేలాయించాలని మత ఉన్మాదులు ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకు కమ్యునిస్టులు వ్యతిరేకమన్నారు పేర్కొన్నారు. 2010లో వీరభద్ర స్వామి దేవ స్థానానికి హరిత హోటల్, యూనియన్ బ్యాంకు మంజూరు చేయించానని గుర్తు చేశారు చాడ వెంకట రెడ్డి.