హాయత్ నగర్ కుoట్లూరులో మళ్ళీ చెడ్డి గ్యాంగ్ కలకలం రేగింది. వరుసగా రెండు ఇండ్లలో 70 వేల నగదు,15 తులాల బంగారు ఆభరణాలు దోపిడీ చేశారు. మరో ఇంట్లో ఇంతకు ముందు చోరీ చేసినప్పుడు మీ ఇల్లు వదిలేశాము, అందుకే మళ్ళీ వచ్చామని చెప్పి మరీ వృద్ధిరాలి మెడలో 4.5 తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. వృద్ధిరాలి మెడకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులకు సమాచారం ఇచ్చిన సకాలంలో స్పందించలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.నెల రోజుల వ్యవధిలోనే రెండుసార్లు ఇదే ప్రాంతంలో చడ్డీ గ్యాంగ్ దొంగతనానికి పాల్పడ్డారు. గత నెల 25న ఇదే ప్రాంతంలో రాత్రి 12గంటల సమయంలోనే చెడ్డీ గ్యాంగ్ చోరీ చేశారు.