రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధంతో ప్రపంచ దేశాలు సంక్షోభాలకు గురవుతున్నాయి. అనేక మంది అమాయకులు ప్రాణాలను కోల్పోతున్నారు. రష్యా సైనిక దాడులను ప్రపంచ దేశాలన్నీ వ్యతిరేకిస్తున్నప్పటికీ.. రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయడం లేదు.
అందుకు దీటుగా ఉక్రెయిన్ సైన్యం పోరాడుతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోదిమిర్ జెలెన్ స్కీ బ్రాండ్ నేమ్ తో ఓ చాయ్ పత్తా మార్కెట్లోకి విడుదలైంది. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో అసమాన ధైర్యం చూపుతున్న జెలెన్ స్కీ కి గౌరవార్థం ఆయన పేరు మీదుగా.. జెలెన్ స్కీ బ్లాక్ టీ పౌడర్ ను అస్సాం స్టార్టప్ కంపెనీ అరోమిక్ టీ విడుదల చేసింది.
రియల్లీ స్ట్రాంగ్.. స్ట్రాంగ్ అస్సాం బ్లాక్ టీ అంటూ క్యాప్షన్స్ పెట్టింది. ఉక్రెయిన్ నుంచి సేఫ్ గా పారిపోయేందుకు సహాయం చేస్తామన్న అమెరికా ఆఫర్ ను తిరస్కరించినప్పుడే జెలెన్ స్కీ అద్భుతమైన క్యారెక్టర్ బయటపడిందని కంపెనీ పేర్కొంది.
అందుకే ఆయన పేరిట తాము ఓ బ్రాండ్ ను ప్రారంభించినట్టు అరోమిక్ టీ డైరెక్టర్ రంజిత్ బారువా చెప్పారు. ఇది తన దైర్యానికి ఇచ్చే గౌరవం అని ఆయన తెలిపారు.