సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ చిన్న విషయం అయినా ఇట్టే వైరల్ అవుతూ వస్తుంది. సినీ స్టార్స్ విషయం లో అయితే అది మరింత ఎక్కువ అవుతుంది. కాగా నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకోబోతున్నట్టు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. అయితే ఆ పుకార్ల కు చెక్ పెడుతూ…ట్వీట్ చేశాడు నాగ చైతన్య.
చైతన్య, సాయిపల్లవి నటించి లవ్ స్టోరీ ట్రైలర్ విడుదలైంది. చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ సమంత కూడా ట్వీట్ చేసింది. దానికి చైతూ స్పందిస్తూ థాంక్స్ సామ్ అంటూ రీట్వీట్ చేశాడు. దీంతో విడాకుల మాట పుకార్లేనని అభిమానులు మాట్లాడుకుంటున్నారు.