చైన్ స్నాచర్స్ మళ్లీ రెచ్చిపోతున్నారు. సికింద్రాబాద్ నార్త్ జోన్ పరిధిలో ఒకే రోజు రెండు చైన్ లు కొట్టేసి పోలీసులకు సవాల్ విసిరారు. మారేడ్ పల్లి పీఎస్ పరిధిలో విజయ అనే మహిళ మెడలోంచి 4తులాల బంగార గొలుసు తీసుకొని పరారీ కాగా…అక్కడికి కిలోమీటరు దూరంలో తుకారాం గేట్ పీఎస్ పరిధిలో అనే మరో మహిళ మెడలో నుండి 3తులాల చైన్ ను కొట్టేశారు.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు. చోరీకి వాడిన వాహనం యాక్టివా గా పోలీసులు గుర్తించారు. అలాగే బండి నంబర్ ను కూడా సీసీలో కెమెరా లో పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
వారిని పట్టుకునేందుకు టాస్క్ ఫోర్స్ పోలీసులు సైతం రంగంలోకి దిగారు. ప్రత్యేక టీం లను ఏర్పాటు చేసి 24గంటల్లో పట్టుకునేందుకు రెడీ అవుతున్నారు.