చైన్ స్నాచింగ్ కేటుగాళ్ల ఆగడాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. పట్ట పగలే నడిరోడ్డుపైనే దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా మరో చైన్ స్నాచింగ్ ఘటన హైదరాబాద్ లోని సికింద్రాబాద్ లో చోటు చేసుకుంది.
సికింద్రాబాద్ లో మిట్ట మధ్యాహ్నం నడిరోడ్డుపై చైన్ స్నాచింగ్ కి పాల్పడ్డాడు ఓ దుండగుడు. సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎప్పుడూ రద్దీతో ఉండే రహదారిపై మిట్ట మధ్యాహ్నం ఈ దొంగతనం జరిగింది.
అందరూ ఉండగానే ఓ వ్యక్తి మహిళా మెడలో ఉన్న గొలుసులు తెంపుకొని పారిపోయాడు చైన్ స్నాచర్. ఈ షాక్ నుంచి తేరుకున్న మహిళ.. వెంటనే కేకలు పెట్టింది.
దీన్ని గమనించిన స్థానికులు గోపాలపురం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి అతని వెనుకే పరిగెత్తి, అతని దగ్గర ఉన్న గొలుసును తీసుకొని సదరు మహిళకు అప్పగించారు. చైన్ స్నాచర్ వ్యక్తిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు పోలీసులు.