బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. సీఎం నితీశ్ కుమార్ పై ఓ గుర్తు తెలియని వ్యక్తి కుర్చి విసిరాడు. ఔరంగాబాద్ పట్టణంలో నితీశ్ సమాధాన యాత్ర చేపట్టారు. ఈ యాత్రకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు.
యాత్రలో భాగంగా బరూర్ బ్లాక్‌లో పంచాయతీ భవనాన్ని ప్రారంభించేందుకు సీఎం నితీశ్ కుమార్ వచ్చారు. అక్కడి నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో జనాల మధ్యలో నుంచి ఓ గుర్తు తెలియని వ్యక్తి సీఎం నితీశ్‌పైకి విరిగిన ప్లాస్టిక్ కుర్చీని విసిరేశాడు.
ఆ చైర్ నితీశ్ కుమార్ కు కొంచెం దూరంలో పడింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకుచ్చాను. వెంటనే భద్రతా సిబ్బంది అప్రపమత్తమయ్యారు. వెంటనే సీఎం చుట్టూ రక్షణ వలయంగా ఏర్పడి ఆయన్ని భద్రతా సిబ్బంది సురక్షితంగా అక్కడి నుంచి తీసుకు వెళ్లారు.
కుర్చీ విసిరిన వ్యక్తి కోసం ఔరంగాబాద్ పోలీసులు గాలిస్తున్నారు.అంతకు ముందు నితీశ్ కుమార్ రోహతాస్ జిల్లాలో పర్యటించారు. అక్కడ మద్యం సేవించడం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తు ఇటీవల వార్తల్లో నిలిచిన సలోని అనే బాలికను ఆయన కలిసి అభినందించారు.