మాజీ హీరోయిన్ నిహారిక కొణిదెల ఈమధ్య సోషల్ మీడియా నుంచి తప్పుకుంది. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను డీ-యాక్టివేట్ చేసింది. దీంతో చాలామంది పుకార్లు రేపారు. కొంతమంది ఆమె గర్భవతి అయిందని చెప్పగా, మరికొంతమంది ఏకంగా ఆమె తన భర్త నుంచి విడిపోయిందని రాసుకొచ్చారు. ఈ పుకార్లపై నిహారిక భర్త చైతన్య స్పందించాడు. ఫొటోలతో పుకార్లు ఖండించాడు.
తన భార్య నిహారిక ఇంట్లో ఛిల్లింగ్ మూడ్ లో ఉన్న ఫొటోను చైతన్య షేర్ చేశాడు. ఈ ఒక్క ఫొటోతో తామిద్దరి మధ్య ఎలాంటి అభిప్రాయబేధాలు లేవని చెప్పకనే చెప్పాడు. వీకెండ్ ను ఇద్దరూ సరదాగా ఎంజాయ్ చేశారు. అలా వీకెండ్ టైమ్ లో నిహారిక ఇంట్లో తీరిగ్గా ఉన్న ఫొటోను చైతన్య షేర్ చేశాడు.
నాగబాబు కూతురిగా, హీరో వరుణ్ తేజ్ చెల్లెలిగా నిహారికకు సెలబ్రిటీ స్టేటస్ ఉంది. పైగా ఆమె కొన్ని సినిమాలు, వెబ్ మూవీస్ లో కూడా నటించింది. దీనికితోడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా కూడా ఉంటుంది. ఇలా అమ్మాయి ఒక్కసారిగా తన ఎకౌంట్ ను మూసేయడంతో అనుమానాలు ఎక్కువయ్యాయి.
కనీసం ఎకౌంట్ ను క్లోజ్ చేసేముందు, ఆమె ఎలాంటి ప్రకటన చేయకపోవడం అనుమానాలకు మరింత తావిచ్చింది. ఆమె ఎందుకు ఇనస్టాగ్రామ్ నుంచి తప్పుకుందనేది ఇప్పటికీ చాలామందికి తెలియదు.