చైతన్య గ్రూప్ ఆఫ్ కాలేజీస్ చైర్మన్ బీఎస్ రావు సంచలన ఆరోపణలు చేశారు. పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ తమను మోసం చేశారని ఆరోపించారు బీఎస్ రావు. తమ కాలేజీలను విస్తరించేందుకు లింగమనేని రమేష్ భూములు, భవనాలు ఇస్తామని చెప్పి తమతో పెట్టుబడి పేరుతో డిపాజిట్లు సేకరించారని అన్నారు.
లింగమనేని రమేష్ ను నమ్మి 2012-13లో చెక్కుల రూపంలో రూ.310 కోట్ల వరకు ఇచ్చామన్నారు. ఈ విషయంపై 2016లో ఎంఓయూ రాసి భూములు ఇప్పిస్తా అని హామీ ఇచ్చి మోసం చేశారని అన్నారు. ఈ ఒప్పందం కొంత మంది పెద్దల సమక్షంలో జరిగినట్లు ఆయన పేర్కొన్నారు.
లింగమనేని రమేష్ మీద హైదరాబాద్ సీసీఎస్ లో ఆరు చీటింగ్ కేసులు నమోదయ్యాయని బీఎస్ రావు తెలిపారు. నెలవారీగా తమకు వడ్డీతో సహా చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా చెల్లించడం లేదని ఆయన ఆరోపించారు.
గతంలో ఆయన ఇచ్చిన చెక్కులు బ్యాంకులో వేయగానే చెల్లలేదని చెప్పారు. ఇప్పటివరకూ మొత్తం 10 చెక్కులు ఇవ్వగా.. ఒక్కటి కూడా చెల్లలేదన్నారు పేర్కొన్నారు బీఎస్ రావు.