ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ఇంట విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ గచ్చిబౌలిలో తన భర్తతో కలిసి ఉంటున్న ఆయన కూతురు శిరిష్మ ఆత్మహత్య చేసుకున్నారు.
ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేసే శిరిష్మకు మణికొండకు చెందిన గ్రానైట్ వ్యాపారి సిద్ధార్థ్‌తో 2016లో వివాహమైంది. వివాహం జరిగి ఐదేళ్లయినా వీరికి పిల్లలు లేరు. నిన్న రాత్రి ఇంటికి వచ్చేసరికి శిరిష్మ గదిలోని ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని కనిపించినట్టు ఆమె భర్త సిద్ధార్థ్ పోలీసులకు తెలిపారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పినట్టుగా వివరించారు. చలసాని శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని రాయదుర్గం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.