తెలుగులో కాస్త పేరు రాగానే చలో బాలీవుడ్ ! ఇది టాలీవుడ్ హీరోయిన్ల రూట్!! స్టార్ హీరోయిన్ ముద్ర పడగానే ఇక బాలీవుడ్ టార్గెట్. తెలుగులో తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్‌గా రష్మిక మండన్న పేరు తెచ్చుకున్నది. తెలుగులో స్టార్ హీరోల సరసన నటిస్తుండగా రష్మికకు బాలీవుడ్ పిలుపొచ్చింది. తెలుగు సినిమా జెర్సీ రీమేక్‌లో హీరో షాహిద్ కపూర్ జోడీగా అవకాశం.
కబీర్‌సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న షాహిద్ పై బాలీవుడ్‌లో బోలెడన్ని అంచనాలున్నాయి. స్టార్ హీరోలు సాధించలేని ఘనతను అతను సాధించాడన్న పేరు వచ్చింది. దర్శక నిర్మాతలు చాల మంది అతని ఇంటి ముందు క్యూ కడుతున్నారు. అలాంటి హీరో పక్కన అవకాశం రావడమంటే జాక్ పాట్ కొట్టినట్లేనని సినీ పండితులంటున్నారు. ఇలా టాలీవుడ్లో సక్సెస్ అయి బాలీవుడ్ బాట పట్టిన హీరోయిన్ల జాబితాలో రష్మిక చేరింది. ఇక టాలీవుడ్ మరో కొత్త భామను చూసుకోవాల్సిందే.