ఛలో సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన డైరెక్టర్ వెంకీ కుడుముల. అదే సినిమాతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరో నాగశౌర్య. అయితే… వీరిద్దరి మధ్య సంబంధాలు మరీ దారుణంగా ఉన్నట్లు కనపడుతున్నాయి.
ఇటీవల శౌర్య తన అశ్వద్థామ సినిమా ప్రమోషన్స్‌లో వెంకీ కుడుములపై సంచలన ఆరోపణలు చేసినట్లు ప్రచారం సాగింది. వెంకీ తన కుటుంబంతో అనవసరంగా గొడవలు పడ్డాడని, దూరంగా ఉంటున్నారని, తన కారును కూడా అమ్ముకున్నాడంటూ జోరుగా ప్రచారం సాగింది.
తాజాగా భీష్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకీ కుడుముల హీరో నాగశౌర్య వ్యాఖ్యలపై స్పందించాడు. తన ఆరోపణల్లో నిజం లేదని, తాను కారు అమ్ముకున్నానని చెప్పటం అబద్ధమన్నారు. వ్యక్తిగత విషయాలపై మాట్లాడటం మంచిది కాదంటూ శౌర్యకు కౌంటర్ ఇచ్చారు. దీంతో ఈ ఇద్దరి మధ్య ఆగాదం పెద్దగానే ఉందంటూ ఫిలిం నగర్ వర్గాల్లో చర్చ సాగుతోంది.
అయితే, గతంలోనూ హీరోయిన్ సాయి పల్లవితోనూ వెంకీ కుడుములకు పొసగలేదు. సాయి పల్లవిని రూడ్ అంటూ కామెంట్ చేయటం విశేషం.