తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గజ్వేల్ సభపై భారీ అంచనాలున్నాయి. స్వయంగా సీఎం నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ కావటంతో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరానున్నాయి. అయితే, ఈ సభకు ముందు అధికార పార్టీ నుండి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న విమర్శలు కూడా వచ్చాయి.
ఛలో గజ్వేల్ పేరుతో కాంగ్రెస్ విస్తృత ప్రచారం చేస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఛలో గజ్వేల్ బాగా ప్రాచుర్యంలోకి రావటంతో ఛలో గజ్వేల్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. పొలిటికల్ ఇష్యూస్ టాప్ ట్రెండింగ్స్ లో ఛలో గజ్వేల్ రెండోస్థానంలో ఉండటం విశేషం. కాంగ్రెస్ సభకు వస్తున్న అపూర్వ ఆదరణకు ఇది నిదర్శనం అని కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.