జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనదైన గుర్తింపు సంపాదించుకున్నాడు చమ్మక్ చంద్ర. ఫ్యామిలీ స్కిట్స్ చేస్తూ ప్రేక్షకులను అల్లరించేవాడు. ప్రముఖ కమెడియన్ గా ఎదగడానికి ఫ్యామిలీ స్కిట్స్ ఎంతగానో దోహదం చేశాయని చెపొచ్చు . అయితే ఇటీవల చంద్ర ఈటీవీ నుంచి జీ తెలుగుకు మకాం మార్చాడు. నాగబాబుతో పాటు చమ్మక్ చంద్ర కుడా ‘అదిరింది’ షో లోకి ఎంటరైయ్యాడు. అయితే మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్న చంద్ర తాను మరో ఛానెల్ మారడంటే ఆయనకు బాగానే ఇచ్చారనే టాక్ వినబడుతోంది.
చంద్ర ఛానల్ మారడానికి బాగానే తీసుకున్నాడని ప్రచారం సాగుతోంది. జబర్దస్త్ లో ఉన్న పారితోషకం కంటే డబుల్ రెన్యుమరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. జబర్దస్త్ లో చంద్రకు ఒక్క కాల్షీట్ కోసం దాదాపు 3లక్షలను ఇచ్చేవారని… నెలకు నాలుగు కాల్షీట్ ఉండేవని తెలుస్తుంది. తనదైన కామెడీతో మంచి హాస్యాన్ని పండించే చంద్ర ఇప్పుడు షో మారడానికి తన పారితోషకాన్ని డబుల్ చేశాడని.. అంటే ఒక్కో కాల్షీట్ కోసం ఐదు లక్షలు తీసుకుంటున్నాడని సమాచారం.