నీటి పొదుపు కోసం చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇకపై దాని ఆధ్వర్యంలో జరిగే అధికారిక సమావేశాల్లో సాధ్యమైన మేర తాగు నీటి దుర్వినియోగాన్ని తగ్గించాలని భావించింది. ఇందుకు సంబంధించిన సరికొత్త ఆలోచన చేసింది. ఆయా కార్యక్రమాలకు హాజరయ్యే సభ్యులకు గ్లాసుల్లో సగం నీటిని మాత్రమే అందించాలని నిర్ణయించింది.
చండీగఢ్ నివాసులకు ఇకపై 24 గంటల పాటు మంచినీటిని అందించాలని చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ భావిస్తోంది. ఇందులో భాగంగా నీటిని జాగ్రత్తగా వినియోగించాలని నిర్ణయించుకుంది. ఈ విషయం తెలిసినవారంతా ఇప్పుడు చండిగఢ్ మున్సిపల్ కార్పొరేషన్‌ను మెచ్చుకోక ఉండలేకపోతున్నారు.