సూపర్ స్టార్ మహేష్ బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ స్టార్స్ తో పాటు రాజకీయ ప్రముఖులు సైతం మహేష్ కు సోషల్ మీడియా వేదికగా విషెష్ చెప్తున్నారు. తాజాగా చంద్రబాబు, నారాలోకేష్ లు విషెస్ తెలిపారు. తెలుగు చలనచిత్ర ప్రఖ్యాత నటుడు శ్రీ మహేశ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. మీరు చలనచిత్ర రంగంలో ధృవతారగా వెలగాలని కోరుకుంటూ, మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చంద్రబాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
తెలుగు చలనచిత్ర ప్రఖ్యాత నటుడు శ్రీ @urstrulyMahesh గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు చలనచిత్ర రంగంలో ధృవతారగా వెలగాలని కోరుకుంటూ, మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. pic.twitter.com/2H08GWGgYL
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) August 9, 2020
మరోవైపు బాల నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టి, సూపర్ స్టార్‌గా ఎదిగిన మీ నట జీవితం ఎందరికో ఆదర్శం. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మహేష్ బాబు గారు. మీరు మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, మీ నటనతో తెలుగు ప్రేక్షకులను ఆనందింప చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని నారా లోకేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
బాల నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టి, సూపర్ స్టార్ గా ఎదిగిన మీ నట జీవితం ఎందరికో ఆదర్శం. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు @urstrulyMahesh గారు. మీరు మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, మీ నటనతో తెలుగు ప్రేక్షకులను ఆనందింప చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. pic.twitter.com/knam9W8xkA
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) August 9, 2020