ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు భోగీ వేడుకల్లో పాల్గొన్నారు. అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు జీఎన్ రావు కమిటీ నివేదికను మంటల్లో వేసి దహనం చేశారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ డిమాండ్ చేశారు. జగన్ అనాలోచిత నిర్ణయాలు ఏపీకి తీవ్ర నష్టం వాటిల్లేలా చేస్తున్నాయన్నారు. పరిశ్రమలు అమరావతి నుంచి తరలిపోతున్నాయని.. పెట్టుబడులు పెట్టేందుకు ఎవ్వరూ ఆసక్తి చూపడం లేదని చంద్రబాబు విమర్శించారు.