ప్రతీ ఇంటికీ 94 వేలు బకాయిపడ్డ చంద్రబాబు

చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ సర్కారుపై ప్రతిపక్షనేత వైఎస్ సెటైర్లమీద సెటైర్లు కురిపించారు. జనసంకల్ప యాత్రలో భాగంగా గుంటూరుజిల్లా బాపట్లలో పర్యటించిన జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుమీద విమర్శల పరంపర కొనసాగించారు. ఏపీలోని ప్రతీ కుటుంబానికీ చంద్రబాబు 94వేల రూపాయలు బాకీ పడ్డారన్నారు. చంద్రబాబు ఎక్కడైనా తారసపడితే మాసొమ్ములేవంటూ నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జాబు రావాలంటే బాబు రావాలనే నినాదం ఏమైందని ప్రశ్నించారు. విద్యుత్ బిల్లులు ఏ స్థాయిలో పెరిగాయో గుర్తించాలన్నారు జగన్. తాగేందుకు ఏపీ ప్రజలకు మంచి నీళ్లు లేవుకాని, ప్రతీ పల్లెలోనూ మద్యం ఏరులైపారుతుందని జగన్ టీడీపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ఇంకా ఏమంటున్నారో జగన్ మాటల్లోనే…