రాజధాని తరలింపుపై రైతుల దీక్ష యాబై రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతులను కలిసిన చంద్రబాబు మాట్లాడుతూ పోరాటం చేస్తున్న రైతులకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటి వరకు పోలీసులు అనేక విధముగా ఇబ్బందులు పెట్టారు. అధికారపార్టీ నాయకులు ఇన్ సైడ్ ట్రేడింగ్ అంటున్నారు, కానీ నిలిపించలేకపోతున్నారని విమర్శించారు చంద్రబాబు. ప్రభుత్వ పాలన ఓ పిచ్చి కుక్క మాదిరిగా ఉందన్నారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హైకోర్టు ఇక్కడే అని జీవో జారీ చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం వైఖరి మార్చుకోవట్లేదని తెలిపారు.
ఈ దుర్మాగపు ముఖ్యమంత్రికి సంపాదించడం చేతకాదు. సీఎం కి పాలన కూడా చెయ్యడం రాదని విమర్శించారు. ఖబడ్దార్ సీఎం అని నేను హెచ్చరిస్తున్నాను. పనికి రాని పార్టీ, చెత్త పార్టీ వైస్సార్ పార్టీ అంటూ నిప్పులు చెరిగారు బాబు. ఏడుపు,బాధ పరిష్కారం కాదు. ఒక్కొక్కరి కళ్ళలో పౌరుషం రావాలని పిలుపు నిచ్చారు. మీరు ఏకాకులు కాదు,ఐదు కోట్ల మంది మీ వైపు ఉన్నారని రైతులకు దైర్యం చెప్పారు. నేను అడుగుతున్నా నీకు ధైర్యం ఉంటే రాష్ట్రంలో ఎక్కడైనా డిబేట్ పెట్టండి తేల్చుకుందాం అంటూ సవాల్ విరిరారు. ఎమ్మెల్యే ఆర్కే వాళ్ళ చుట్టాలని తీసుకువెళ్లి రైతులని చెప్తారా అంటూ ప్రశ్నించారు. ఎవరు పెయిడ్ ఆర్టిస్టులో తెలుస్తూ ఉంది. మూడు రాజధానులు అంటే అందరూ మనల్ని చూసి నవ్వుతున్నారు.
మళ్ళీ ఎన్నికలకు వెళ్ళండి, మీరు గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తిసుకుంటా, బుద్ధి హీనుడైన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇలాంటి దుర్మార్గపు పనులు చేస్తున్నాడు.తప్పకుండా బౌష్యత్తులో అందరికి మంచి రోజుకు వస్తాయి.
ఇష్టానుసారం గా ప్రవర్తించే,అధికారులు, నాయకులు,పోలీసు పై తప్పకుండా ప్రతికారం తీర్చుకుంటా అని హెచ్చరించారు.