గుంటూరు: రాష్ట్రంలో జగన్ పాలన సైకో పాలనలా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. అభివృద్ధిని ఆపేసి జగన్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని జాతీయ మీడియాతో మాట్లాడుతూ దుయ్యబట్టారు. ఛలో ఆత్మకూరు కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకోవడంతోనే మేము సక్సెస్ అయ్యామని చంద్రబాబు చెప్పారు. ఆత్మకూరు దాడులపై తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. కార్యకర్తల్లో మనో ధైర్యం నింపుతామన్నారు. టీడీపీ నేతలంతా ప్రభుత్వంపై ఎక్కడికక్కడ పోరాటాలు చేస్తున్నారని అన్నారు.
తెలంగాణలో మేము పుంజుకుంటాం..
టీఆర్ఎస్‌కు, టీడీపీకి వచ్చిన ఓట్ల శాతంలో వున్న తేడాని పుంజుకుంటామని చంద్రబాబు చెప్పారు. ‘టీఆర్ఎస్‌కు, మాకు కేవలం 15 శాతం మాత్రమే తేడా ఉంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 7 నుంచి 10 శాతం ఓట్లు అదనంగా సాధించే అవకాశం ఉంది..’ అని టీడీపీ నేత అన్నారు.