చంద్రబాబు, టీడీపీ జాతీయ అధ్యక్షుడు
తెలుగు వారందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మతాలు, మత విశ్వాసాల అంశంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదు. ప్రజల ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా ప్రవర్తించాలి. అప్పుడే శాంతి, సౌభాగ్యం సాధ్యం. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు.
హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాలు ఎంతో ప్రత్యేకం. గణేష్ వేడుకలు, నిమజ్జనం సందర్భంగా పటిష్ట ఏర్పాట్లతో ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఏ పాలకులూ ప్రవర్తించకూడదు. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే ప్రభుత్వాలు ప్రవర్తించాలి.