పోలీసుల వేధింపుల కారణంగా నంద్యాలలో ఆటో డ్రైవర్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. పోలీసులపై నాన్ బెయిలబుల్ కేసులతోనే సరిపెట్టడం, అరెస్టయిన మరసటి రోజే సీఐ, హెడ్ కానిస్టేబుల్ బెయిల్ పై బయటకు రావటంపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
తప్పుడు కేసు నమోదు చేసి, పోలీసులు వేధించిన కారణంగానే ఆ కుటుంబం మరణించిందని… ఇందులో నిజానిజాలు బయటపడాలంటే సీబీఐ విచారణ జరగాలన్నారు. రాబోయే మూడు రోజుల పాటు టీడీపీ శ్రేణులు ఆందోళన చేయాలని, క్యాండిల్ లైట్ ర్యాలీ చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఈ వేధింపుల వెనుక స్థానిక ఎమ్మెల్యే హస్తం ఉందని ఇప్పటికే టీడీపీ ఆరోపించగా… ఆ పోలీసు అధికారులకు బెయిల్ కోసం టీడీపీ నేతలే పిటిషన్ వేశారని, బెయిల్ రద్దుపై అప్పీల్ చేసినట్లు వైసీపీ ఎదురుదాడి చేసింది.