రాష్ట్రంలో వైసీపీ అరాచకాలను అడ్డుకోవడంలో పోలీసులు విఫలమౌతున్నారని ఆరోపించారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. తిక్కారెడ్డిపై దాడి ఘటనకు సంబంధించి ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కు లేఖ రాశారాయన. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బొంపల్లె ఆలయానికి వెళ్లిన తిక్కారెడ్డిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు చంద్రబాబు. ఈ ఘటనలో ఐదుగురు టీడీపీ కార్యకర్తలు కూడా గాయపడినట్టు లేఖలో వివరించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని తిక్కారెడ్డికి తగిన భద్రత కల్పించాలని కోరారు. ఆయనకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పారు చంద్రబాబు.