ఏపీ సీఎం జగన్ పై మరోసారి ఫైర్ అయ్యారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. మీడియాపై ఆంక్షలు విధించటం… జగన్ అహంకారానికి నిదర్శనమన్నారు. మీడియాపై ఆంక్షలు విధిస్తూ… జీవో కూడా జారీ చేసినా, తర్వాత దాన్ని ఉపసంహరించుకున్నారని తెలిపారు. పాత జీవోకు పదునుపెట్టి మరోసారి జగన్ ఆంక్షలు పెడుతున్నారని, మీడియాపై వైసీపీ నాయకుల నోటి దురుసును గుర్తు చేస్తూ వీడియోలు ప్రదర్శించారు. జగన్ తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలు వెనక్కి తీసుకోకపోతే… తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.