కడప జిల్లా పర్యటనలో భాగంగా టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో చిత్ర విచిత్రమైన పాలన నెలకొందంటూ విమర్శించారు. మద్యం పాలసీలో కమీషన్ ల కోసం కొన్ని బ్రాండ్లకే జగన్ పరిమిషన్ ఇచ్చారని ఆరోపణలు చేశారు. రోజంతా మద్యం అమ్మకాలు సాగితే తమ వాళ్లకు వ్యాపారాలు ఉండవు కాబట్టి, సాయత్రం ఏడు ఎనిమిది గంటలకల్లా షాపులు మూయించి, తమవాళ్లతో ఇళ్ల వద్ద బెల్టు షాపులు తెరిపిస్తాడని వ్యాఖ్యానించారు.
వైసీపీ వాళ్ళ పిచ్చి పరాకాష్టకు చేరుకుందని, జాతీయ జండా కి సైతం రంగులు వేస్తున్నారని విమర్శించారు. గుడి, బడి తేడా లేకుండా ఎక్కడ బడితే అక్కడ రంగులు వేస్తున్నారు. మొన్నటికి మొన్న గాంధీజీ విగ్రహానికి కూడా రంగులు వేశారు. గుడిలో దేవుళ్ళ విగ్రహాలకు వేస్తున్నారు. నేను చెప్తున్నాను మీ ముఖాలకు రంగులు వేసుకోండి, అప్పుడు ప్రజలు ఇంకా తొందరగా గుర్తుపడతారంటూ విమర్శయించారు.