వివాదాలకు కేరాఫ్ అయిన రాంగోపాల్ వర్మ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అయితే ఈ సారి ఏకంగా చంద్రబాబును నరహంతకుడంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తూ.. వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. పెద్ద పెద్ద ప్రాంతాల్లో సభలు పెడితే అక్కడికి జనాలు రారని..దాంతో తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న భయంతోనే.. చంద్రబాబు చిన్న చిన్న ప్రాంతాల్లో సభలు పెడుతున్నారని ఆరోపణలు చేశారు.
చిన్న గీత, పెద్ద గీత అనే కాంటెక్ట్స్ లోనే.. చిన్న ప్రాంతాల్లో సభలు పెడితే, అది పెద్దదిగా కనిపిస్తుందని చంద్రబాబు భావిస్తున్నారన్నారు. ఆ చిన్న ప్రాంతాల్లో నిర్వహించే సభలకు కూడా జనాలు రానన్న భయంతో..కుక్కలకు బిస్కెట్లు వేసినట్లు, ప్రజలకు కానుకల ఎర చూపించి సభకు తీసుకొచ్చారని వర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కేవలం ఫోటోల కోసం చంద్రబాబు కొంతమందికి బిస్కెట్లు వేసి, అక్కడి నుంచి వెళ్లిపోయారని పేర్కొన్నారు. తాను మూడు సార్లు సీఎం అయ్యాయని చెప్పుకునే చంద్రబాబుకి ప్రజలంటే ఏంటో తెలీదా… అని ప్రశ్నించారు వర్మ. ఇలాంటి చిన్న చిన్న ప్రదేశాల్లో సభను నిర్వహిస్తే, ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయన్న విషయం తెలీదా.. అని నిలదీశారు. చంద్రబాబుకి ప్రజల ప్రాణాలు గడ్డితో సమానమని కేవలం స్వప్రయోజనాల గురించి ఆలోచిస్తారే తప్ప, అంతకు మించి ప్రజల సమస్యలు ఆయనకు అవసరం లేదని తెలిపారు వర్మ. కానుకలు ఇచ్చే సంస్కృతిని చంద్రబాబే ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలుసని.. కానుకలకి..లంచానికి తేడా ఏంటని ప్రశ్నించారు.
ఎంతమంది చనిపోతే.. తనకు అంత పాపులారిటీ ఉందని చంద్రబాబు ఫీల్ అవుతారని వర్మ ఆరోపించారు. తన పాపులారిటీకి జనాల చావుల్ని కొలమానంగా తీసుకోవడం.. నిజంగా హీనమైన చర్య అని చెప్పారు వర్మ. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు..చిన్న ప్రాంతాల్లో సభలు పెడితే..అలాంటి పరిణామాలు ఎదురవుతాయని తనకు తెలియదని చెప్పడం కరెక్ట్ కాదని హితవు పలికారు. ఓ రాజకీయ నాయకుడు ప్రజల సెక్యూరిటీని పట్టించుకోకపోవడం ఏంటని వర్మ ప్రశ్నించారు.