తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఏకైక ఎమ్మెల్యే అశ్వారావుపేట నియోజక వర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు కుమారుని వివాహా వేడుకకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు హాజరయ్యారు. చంద్రబాబు నాయుడు రాకతో టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అనంతరం మెచ్చతో ముచ్చటించారు చంద్రబాబు. అక్కడ నుంచి బయలు దేరిన చంద్రబాబు రాత్రికి బెంగుళూరు చేరుకుంటారు. ఆ తరువాత తెదేపా నేత బొల్లినేని రామారావు కుమారుడి పెళ్లికి హాజరవ్వనున్నారు.